గుడి ప్రవేశం అడ్డగింత.. పోలీసులకు ఫిర్యాదు

గుడి ప్రవేశం అడ్డగింత.. పోలీసులకు ఫిర్యాదు

WGL: రాయపర్తి మండలం కొత్తూరులో ముదిరాజ్ కులానికి చెందిన భీమని నవీన్, ఎస్సీ మాదిగ కులానికి చెందిన స్రవంతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇటీవల ముదిరాజుల పెద్దమ్మ తల్లి పండుగ వేడుకలు జరగగా స్రవంతి ఎస్సీ మాదిగ కులానికి చెందినది కాబట్టి గుడిలోకి ప్రవేశం చేయరాదని ముదిరాజుల కుల పెద్దలు అడ్డుకున్నారు. దీంతో బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.