పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
KMM: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. గురువారం రఘునాథపాలెం మండలం వివి పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోలింగ్ సర్వేని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బందికి జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు.