VIDEO: అకాల వర్షం.. నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు

SRCL: చందుర్తి మండలంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. మండలంలోని లింగంపేట- సనుగుల రహదారిలో చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలపై పడడంతో కరెంటు వైర్లు నేలకొరిగాయి. ప్రజలు ఎవరు అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విద్యుత్ వైర్లు తెగడంతో లింగంపేటలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు.