అంబటి రాంబాబు నామినేషన్ దాఖలు

గుంటూరు: సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా అంబటి రాంబాబు గురువారం తన నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా నామినేషన్ కార్యాలయానికి చేరుకున్న ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆశీస్సులతో మరోసారి విజయం సాధిస్తానని చెప్పారు.