'జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోంచి వెళ్లిపోవడం సరికాదు'
JGL: మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోంచి వెళ్లిపోవడం సరికాదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతో 30 ఏళ్లకు పైగా అనుబంధమున్న జీవన్ రెడ్డి.. ఇలా అనూహ్యంగా వెళ్లి పోవడం ఆయనను బాధించిందన్నారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని పీసీపీ అధ్యక్షుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది ఆయనను కోరినప్పటికీ వెళ్లిపోయారని చెప్పారు.