VIDEO: శుభలయ వద్ద రోడ్డు పక్కనే మురుగునీరు, చెత్తాచెదారం
SKLM: హిరమండలం మండలం శుభలయ వద్ద రోడ్డుపై మురుగునీరు ప్రవహించడంతోపాటు చెత్తాచెదారం పోగులుగా తయారైందని స్థానికులు అంటున్నారు. అంతేకాకుండా పందులు కూడా స్వైర్య విహారం చేస్తున్నాయని వారు వాపోతున్నారు. దీంతో ఎలాంటి వ్యాధులు సంక్రమిస్తాయో అని నిత్యం భయభ్రాంతులకు గురవుతున్నామని తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.