'ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి'
SRCL: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇంఛార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగర్వాల్ పిలుపునిచ్చారు. బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్ళపల్లి మండలాల్లో రెండో ఫేజ్ ఎన్నికలు నిర్వహించనున్న సందర్భంగా ఇల్లంతకుంట జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని శనివారం ఇంఛార్జి కలెక్టర్ పరిశీలించారు.