ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
AKP: కోటపాడు మండలం ఏ.కోడూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి శుక్రవారం ప్రారంభించారు. కొనుగోలు కేంద్రం ద్వారా సేకరించిన ధాన్యానికి 24 గంటల్లోగా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది క్వింటాకి రూ. 69 పెంచినట్లు పేర్కొన్నారు. రబీలో పంటల సాగుకు విత్తనాలను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.