ఒంటిమిట్ట కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధం

కడప: ఒంటిమిట్ట కోదండ రామ స్వామి వారి కళ్యాణ మహోత్సవం సోమవారం సాయంత్రం 6:30 నుంచి 8:30 గంటల వరకు జరగనుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూర్చుని ఉండే విధంగా గేలరీలు ఏర్పాటు చేశారు. భక్తులకు మంచి నీళ్ళు, మజ్జిగ ఏర్పాటు చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వచ్చే భక్తులకు స్వామి వారి ముత్యాల తలంబ్రాలు, లడ్డులు ఇవ్వడానికి సిద్ధం చేశారు.