ఢిల్లీ పేలుడు.. CCTV వీడియో
ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనలో మానవ శరీర అవశేషాలు ఇంకా లభ్యమవుతున్నాయి. 500 మీటర్ల దూరంలో తెగిపడిన ఓ చేతిని తాజాగా ఫోరెన్సిక్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. కాగా, ఈ పేలుడుకు సంబంధించి మరో CCTV వీడియో తాజాగా బయటకు వచ్చింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనాలు నిలిచి ఉన్న సమయంలో ఈ భారీ పేలుడు జరిగిన దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి.