'అదానీ అంబుజా సిమెంట్ యూనిట్‌ను అడ్డుకుంటాం'
VSP: గాజువాక సమీపంలోని పెదగంట్యాడ శివారులో అదానీ అంబుజా సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలనే గంగవరం పోర్టు యాజమాన్యం నిర్ణయాన్ని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ యూనిట్ ఏర్పాటును పోరాటాలతో అడ్డుకుంటామని సీపీఐ స్పష్టం చేసింది. మంగళవారం ఆ ప్రాంతంలో ర్యాలీ నిర్వహించింది.