వేములవాడ శివార్చన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే

రాజన్న సిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన శివార్చన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, పాడి పంటలతో చల్లంగుండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.