పట్టాలెక్కనున్న మణిరత్నం మూవీ

పట్టాలెక్కనున్న మణిరత్నం మూవీ

మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా ఒక ప్రేమకథా చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ప్రోమో షూట్ ఈ నెలలోనే జరగనుందట. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోందని టాక్. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ డ్రామాను నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారు.