'న్యూఇయర్ వేడుకలకు అనుమతులు తప్పనిసరి'
HYD: కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఈ నెల 16లోపు దరఖాస్తు చేసుకోవాలని CP సజ్జనార్ పేర్కొన్నారు. అనుమతిలేకుండా వేడుకలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, 31న అర్ధరాత్రి ఒంటి గంటవరకే వేడుకలు నిర్వహించాలని సూచించారు. ప్రజలు ఎక్కడా ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా నిర్వహణ ప్రాంగణంలో CC కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.