స్క్రబ్ టైఫస్ నివారణపై ప్రజలకు అవగాహన
కృష్ణా: తోట్లవల్లూరులో మండల ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో స్క్రబ్ టైఫస్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బుధవారం ర్యాలీ నిర్వహించారు. గడ్డివాములు, పొలాల్లో ఉండే సూక్ష్మ పురుగుల వల్ల స్క్రబ్ టైఫస్ వస్తుందని, జ్వరం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని డాక్టర్ ప్రసన్న తెలిపారు.