VIDEO: కర్మన్ ఘాట్‌లో అగ్ని ప్రమాదం

RR: సరూర్ నగర్ PS పరిధి కర్మన్ ఘాట్ శుభోదయం నగర్ కాలనీలోని ఓ కిరాణ జనరల్ స్టోర్‌లో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. షాప్ నుంచి దట్టమైన పొగలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.