అన్న క్యాంటీన్‌లో చంద్రబాబు దంపతులు
AP: పుట్టినరోజు సందర్భంగా విజయవాడ పటమట అన్న క్యాంటీన్‌కు సీఎం చంద్రబాబు దంపతులు చేరుకున్నారు. వారు పేదలకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. అనంతరం వారు కూడా అల్పాహారం తిన్నారు. కాగా, అన్న క్యాంటీన్ల ఒకరోజు ఖర్చు రూ.76 లక్షలు భువనేశ్వరి విరాళంగా ఇచ్చారు. దీంతో రాష్ట్రంలోని 269 అన్న క్యాంటీన్లలో ఉచితంగా ఆహారం అందిస్తున్నారు.