మండపాల నిర్వాహకులకు పోలీసుల సూచనలు

KMR: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా సీఐ నరహరి మాట్లాడుతూ.. మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ అనుమతి పొందాలని, భక్తి శ్రద్ధలతో పూజలు జరపాలని శనివారం సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రోడ్లపై విగ్రహాలు పెట్టవద్దని, ఏదైనా ఇబ్బంది ఎదురైతే డయల్ 100కు ఫోన్ చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సైలు, పలువురు మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.