రష్యా దాడిలో ఐదుగురు ఉక్రెయిన్ పౌరుల మృతి
కీవ్ పరిసరాల్లో రష్యా జరిపిన క్షిపణి దాడుల్లో ఐదుగురు మరణించారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. రష్యన్లు సాధారణ ప్రజానీకంపై దాడుల్ని ఉద్ధృతం చేశారని మండిపడ్డారు. మరోవైపు క్రైస్తవ పర్వదినమైన ఈస్టర్ సందర్భంగా తాత్కాలిక కాల్పుల విరమణకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలియజేశారు. ఉక్రెయిన్, రష్యా దేశాలు ఈస్టర్ పర్వదినాన్ని వేడుకగా జరుపుకుంటాయి.