ఏప్రిల్ 1 నుంచి చైనా కెమెరాలపై బ్యాన్
కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత దృష్ట్యా మేడ్ ఇన్ చైనా కెమెరాల వినియోగంపై బ్యాన్ విధించింది. ఏప్రిల్ 1 నుంచి నిబంధన అమలు కానుంది. ఇకపై దేశంలో స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్యాలిటీ సర్టిఫికేషన్(STQC) అనుమతి ఉన్న కెమెరాలను మాత్రమే విక్రయించేందుకు అనుమతి ఇచ్చింది. చైనా కెమెరాల ద్వారా దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందున కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.