బెయిల్ పేరుతో మోసం చేసిన వ్యక్తి అరెస్ట్..!
SRPT: రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వ్యభిచార కేసులో నిందితుడికి బెయిల్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్న వంగూరి సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిరేకల్‌కు చెందిన రవీంద్ర నుంచి రూ.70 వేలు తీసుకొని, మరికొంత రూ.60 వేలు డిమాండ్ చేయడంతో ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అడ్వకేట్‌ల పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని CI రాజశేఖర్ హెచ్చరించారు.