కుక్క కాటుతో మరణిస్తే రూ.5 లక్షల పరిహారం

కుక్క కాటుతో మరణిస్తే రూ.5 లక్షల పరిహారం

వీధి కుక్కల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారికి కర్ణాటక సర్కార్ రూ.5లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.5వేలు అందించనుంది. ఇందులో రూ.3,500 బాధితుడికి, మిగిలిన రూ.1500 సురక్ష ట్రస్టుకు చికిత్స ఖర్చుల కోసం కేటాయిస్తారు. 2023లో కూడా ఇలాంటి ఉత్తర్వులే జారీ చేశారు. కానీ, ప్రస్తుతం ఉత్తర్వుల్లో గాయపడిన వారికి పరిహారం చెల్లించే విధానంలో మార్పులు చేశారు.