స్మార్ట్ కార్డులను పంపిణీ చేసిన TDP నేతలు

NLR: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను TDP నాయకులు మమతారెడ్డి, గుద్దేటి చెంచయ్య, అస్లాం తదితరులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు జిలానీ తదితరులు పాల్గొన్నారు.