వంటగ్యాస్‌పై కేంద్రం కీలక నిర్ణయం

వంటగ్యాస్‌పై కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో LPG కొరత లేదని, సరఫరాను స్థిరీకరించామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా దేశంలో పలు హోటళ్లు, రెస్టారంట్లు మూతపడినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి రిఫైనరీలు LPG ఉత్పత్తిని 10 శాతం మేర పెంచాయని తెలిపాయి. కృత్రిమ కొరతను నిరోధించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి.