పిడుగుపాటుతో ఇద్దరు గిరిజనులకు గాయాలు
ASR: డుంబ్రిగుడ మండలం సిందిపుట్టులో గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజనులు పశువుల మేతకు వెళ్లగా ఆకస్మికంగా పిడుగు పడింది. ఈ ఘటనలో కిల్లో ధనుర్జాయ్, గొల్లోరి నబోన గాయపడ్డారు. వారితో ఉన్న దుక్కి పశువుపై పిడుగు పడటంతో అది అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన వారిని పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు.