CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KDP: టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరం లాంటిదని అన్నారు. సోమవారం కడప నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 42 మందికి రూ. 41.92 లక్షల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు సహాయం అందించడంలో ముందుంటారని వారు తెలిపారు.