బాపట్లలో త్రాగునీటి పైపు లీకై వృధాగా పోతున్న నీరు

బాపట్లలో త్రాగునీటి పైపు లీకై వృధాగా పోతున్న నీరు

గుంటూరు: బాపట్ల పట్టణంలో సోమవారం ప్రధాన రహదారిలో త్రాగునీటి పైపు లీకై నీరు వృధాగా పోతుంది. ప్రతి రోజు పరిస్థితి ఇలాగే ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొత్త వాటర్ పైప్ లైన్ వేసినప్పటి నుండి పరిస్థితి ఇలానే ఉందని ప్రజలు చెబుతున్నారు. నీరు వదిలే సమయంలో గంటలకు తరబడి ఇలా పైపులు లీకై నీరు వృధా పోవటం వల్ల రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని స్ధానికులు తెలిపారు.