మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం
ATP: అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి హరికృష్ణ కుటుంబానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆర్థిక సాయం అందజేశారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ దొడగట్ట గ్రామానికి చెందిన హరికృష్ణ మృతిపై ఎమ్మెల్యే చొరవతో కళాశాల యాజమాన్యం నుంచి రూ. 3.50 లక్షలు మంజూరయ్యాయి. ఈ మొత్తాన్ని బాధితుడి తల్లిదండ్రులకు ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు.