జిల్లాలో తగ్గని 'గ్యాస్' మంట
బాపట్ల: జిల్లా ప్రజలకు గ్యాస్ కష్టాలు ఇంకా తొలగడం లేదు. బుక్ చేసిన 20 రోజుల తర్వాత సిలిండర్ సరఫరా చేస్తుండటం పెద్ద సమస్యగా మారింది. సింగిల్ సిలిండర్ ఉన్న వారు మరింత ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 27 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా.. 4.86 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. పశ్చిమాసియాలో యుద్ధానికి ముందు ఈ పరిస్థితి లేదని.. ఇది సాధారణ స్థితికి ఎప్పుడు వస్తుందోనని వినియోగదారులు ఎదురుచూస్తున్నారు.