VIDEO: ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన సివిల్ సప్లైస్ డైరెక్టర్

NLR: సర్వేపల్లి నియోజకవర్గం గొలగమూడిలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామి రెడ్డి ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని బాలికలను భోజన సదుపాయాలు, సౌకర్యాలను అడిగి తెలుసుకొని పిల్లలతో పాటు అక్కడే భోంచేశారు. వంటగది, స్టోర్ రూమ్‌లోని బియ్యం క్వాలిటీ, నిల్వలను తనిఖీ చేశారు.