కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
NZB: రుద్రూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (ఆంగ్ల మాధ్యమం)లో2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రత్యేకాధికారిణి బీ. శ్యామల తెలిపారు. 40 సీట్లకు అర్హులైన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థినులు అవసరమైన ధ్రువపత్రాల జిరాక్స్ తీసుకురావలన్నారు.