ఆదర్ష్ కళాశాలలో కొబ్బరి పీచుతో గణనాథుడి విగ్రహం

KKD: గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఆదర్ష్ ఇంజినీరింగ్ కళాశాలలో గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొబ్బరి పీచు, తాళ్లతో నాలుగడుగుల గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏడాది వినాయకచవితికి వినూత్న ఆకృతిలో విగ్రహాన్ని రూపొందించడం తమ ఆనవాయితీ అని కళాశాల ఛైర్మన్ బుర్రా అనుబాబు తెలిపారు.