ఆర్మూర్లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

NZB: ఆర్మూర్ పట్టణంలో టీచర్స్ కాలనీ కెనాల్ కట్ట ప్రాంతంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడిని జగిత్యాల జిల్లా మల్లాపూర్ గ్రామానికి చెందిన సాయిలు (60)గా గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.