VIDEO: 24 గంటల్లో చీటింగ్ కేసును ఛేదించిన పోలీసులు

MBNR: జిల్లాలో జరిగిన చీటింగ్ కేసును టూ టౌన్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నారాయణపేట జిల్లా గుండుమల్ మండలం బలబద్రయపల్లి గ్రామానికి చెందిన ఆశప్పను, నవాబుపేట(మం) పోమాల్‌కు చెందిన రాములు ఫోన్ చేసి, రూ.2 లక్షలకు రూ.10 లక్షలు ఇస్తానని నమ్మబలికాడు. ఆశప్ప రూ.2 లక్షలు ఇవ్వగా, రాములు మోసం చేసి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.