హోటళ్లు అదనంగా వసూల్ చేస్తే ఫిర్యాదు చేయండి: కేంద్రం
దేశవ్యాప్తంగా ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు LPG పేరుతో అదనంగా వసూలు చేయొద్దని ఆదేశించిన విషయం తెలిసిందే. ఒకవేళ ఎవరైనా అదనపు ఛార్జీలు వసూలు చేస్తే నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ 1915కు ఫిర్యాదు చేయవచ్చని CCPA వెల్లడించింది. అలాగే CCPA, ఈ జాగృతి పోర్టల్, కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది. ఆధారాలు చూపించేందుకు బిల్లు కాపీని దగ్గర ఉంచుకోవాలని సూచించింది.