నేడు తాంసి మండలంలో ఎమ్మెల్యే పర్యటన

ADB: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారం సాయంత్రం తాంసి మండల కేంద్రంలో పర్యటించనున్నారని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్రతినిధులు తెలియజేశారు. పోలాల అమావాస్య పండుగను పురస్కరించుకొని గ్రామంలో నిర్వహించనున్న ఎద్దుల జాతర కార్యక్రమంలో పాల్గొననున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.