VIDEO: అన్నవరం సత్యదేవునికి భారీ ఆదాయం
KKD: అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి క్షేత్రానికి సోమవారం భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని వ్రతాలు ఆచరించారు. భక్తులు సమర్పించిన విరాళాలు, వివిధ సేవా టికెట్ల ద్వారా ఆలయానికి ఒక్కరోజే రూ. 31.92 లక్షల ఆదాయం లభించిందని అధికారులు వెల్లడించారు