రాజాపేటలో ఎన్నికల సామాగ్రి కేంద్రం పరిశీలన
BHNG: రాజాపేట మండలంలో మొదటి ఫేజ్ గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను అదనపు కలెక్టర్ వీరారెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈనెల 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. ఎంపీడీవో నాగవేణి, ఎంఈవో తదితర అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్ సజావుగా జరగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.