బరితెగిస్తున్న ఇసుక మాఫియా
VKB: బషీరాబాద్‌లో ఇసుక మాఫియా బరితెగించింది. ఇవాళ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీస్ వాహనంపైకి ఇసుక ట్రాక్టర్లు దూసుకురావడంతో వాహనం ముందు భాగం ధ్వంసమైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకుని వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తుండగా, నిందితులు ఒక్కసారిగా పోలీస్ జీపుపైకి ట్రాక్టర్‌ను ఎక్కించే ప్రయత్నం చేశారు.