బెహరా ఆస‍్పత్రిపై కేసు నమోదు

బెహరా ఆస‍్పత్రిపై కేసు నమోదు

విశాఖలోని గోపాలపట్నంలోని బెహరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పత్రికా పంపిణీదారుడు కె.వెంకట్రావు (65) మృతి చెందారు. కాలికి గాయంతో చేరిన ఆయనకు చిన్నపాటి శస్త్రచికిత్సకు ముందు ఇచ్చిన అనస్థీషియా మోతాదు అధికమైందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.