నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
SKLM: సోంపేట విద్యుత్ ఉపకేంద్ర పరిధిలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఈఈ యజ్ఞేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోంపేట, బెంకిలి, జింకీభద్ర తదితర గ్రామాలలో ఈ అంతరాయం ఏర్పడుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, విద్యుత్ శాఖవారికి సహకరించాలని కోరారు.