ఆర్మూర్​లో పోలీసుల విస్తృత తనిఖీలు

ఆర్మూర్​లో పోలీసుల విస్తృత తనిఖీలు

NZB: ఆర్మూర్ పట్టణంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా సాయంత్రం తనిఖీలు చేపట్టారు. ఎస్​హెచ్​వో సత్యనారాయణ గౌడ్​ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్​తో పాటు పలు టీ స్టాళ్లలో పోలీసులు డాగ్​ స్క్వాడ్​ బృందంతో తనిఖీలు చేపట్టారు. మాదక ద్రవ్యాలు, గంజాయి రవాణ, వినియోగం నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.