జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని

PLD: వినుకొండ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన బండారు రవళి జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు అర్హత సాధించింది. ప్రకాశం జిల్లా చేవూరులో జరిగిన 11వ అంతర జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ జూనియర్ బాలికల విభాగంలో ఆమె ప్రతిభ కనబరిచింది. ఈ నెలలో తమిళనాడులో జరగబోయే జాతీయ పోటీల్లో రవళి పాల్గొంటుందని ప్రధానోపాధ్యాయురాలు బి. శైలజకుమారి బుధవారం తెలిపారు.