VIDEO: ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

VIDEO: ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రజల సమస్యలపై వారి వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వచ్చిన అర్జీలు అన్నింటిని పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ మేరకు కొన్ని సమస్యలను ఎమ్మెల్యే తక్షణమే పరిష్కరించినట్లు అర్జీదారులు తెలిపారు.