రేపు టీటీడీ అత్యవసర సమావేశం

AP: బుధవారం టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం జరగనుంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన రేపు ఉదయం 11గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. టీటీడీ, పర్యాటకశాఖ మధ్య భూమార్పిడి నిర్ణయం తీసుకోనున్నారు.