భీమిలిలో సామూహిక వందేమాతర గేయాలాపన
VSP: వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భీమిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం సామూహిక గేయాలాపన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 600 మంది విద్యార్థులు, 25 మంది అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ రాంప్రసాద్ వందేమాతరం గేయం గొప్పతనాన్ని, చారిత్రక నేపథ్యాన్ని వివరించారు.