ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

UP లిఖింపూర్ ఖేరీ జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధఖేర్వా గిరిజా పూరి హైవేపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి కాలువలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.