పంచాయతీ భవన నిర్మాణ పనులు ప్రారంభం
NRPT: దామరగిద్ద మండల పరిధిలోని వత్తుగుండ్ల గ్రామ నూతన పంచాయతీ భవన నిర్మాణ పనులను గురువారం సర్పంచ్ మ్యాకలి వెంకటమ్మ ప్రారంభించారు. గత ప్రభుత్వ హాయంలో అసంపూర్తిగా మిగిలిన పనులను ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి నిధులు కేటాయించడంతో మిగిలిన పనులను ప్రారంభించినట్లు చెప్పారు. సర్పంచ్‌లతో పాటు పలువురు వార్డు మెంబర్లు గ్రామస్థులు పాల్గొన్నారు.