తిరుమలలో అక్రమ వసూళ్లు.. ఉద్యోగిపై వేటు

తిరుమలలో అక్రమ వసూళ్లు.. ఉద్యోగిపై వేటు

AP: తిరుమలలో భక్తుల లగేజీ కేంద్రంలో అక్రమ వసూళ్లకు పాల్పడిన నరసింహారెడ్డి అనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని టీటీడీ విధుల నుంచి తొలగించింది. ఉచితంగా అందించే ఈ సేవలకు ఒక్కో బ్యాగుకు రూ.50 నుండి రూ.100 వరకు వసూలు చేస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు, నిందితుడిపై తక్షణమే చర్యలు తీసుకున్నారు.