జిల్లాలో రాజకీయ రచ్చ.. కర్రలు, రాడ్లతో పరస్పరం దాడులు!

జిల్లాలో రాజకీయ రచ్చ.. కర్రలు, రాడ్లతో పరస్పరం దాడులు!

నల్లగొండ జిల్లా చండూరులో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల కక్షలతో ఇరువర్గాలు కర్రలు ఇనుప రాడ్లతో పరస్పరం దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఒకరికి తీవ్ర గాయాలవ్వడంతో చికిత్స కోసం నల్లగొండ జీజీహెచ్‌కు తరలించారు. బాధితుడు కిరణ్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.